పొట్టకూటీ కోసం వెళ్తూ మృతి | - | Sakshi
Sakshi News home page

పొట్టకూటీ కోసం వెళ్తూ మృతి

Nov 5 2025 9:00 AM | Updated on Nov 5 2025 9:00 AM

పొట్ట

పొట్టకూటీ కోసం వెళ్తూ మృతి

ధన్వాడ: మండలంలోని కిష్టాపూర్‌లో ఓ వలస కూ లి మంగళవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన దస్తగిరి దస్తన్న (40) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆదివారం రాత్రి దస్తన్న, భార్య మైబ మ్మ పెద్ద కూతురితో సహా మొత్తం 12 మంది బతుకు దెరువు కోసం ముంబాయికి బయలుదేరారు. అయితే సోలాపూర్‌ దగ్గరలో అన్నం తి నేందుకు దస్తన్నను లేపగా ఎలాంటి స్పందన లేదు. అప్పటికే మృతి చెందినట్లు తెలియడంతో అక్కడి నుంచి ప్రైవేట్‌ వాహనంలో గ్రామానికి తీసుకొచ్చారు. మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భర్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

పాము కాటుతో

యువకుడు మృతి

వనపర్తి రూరల్‌: పాముకాటుకు గురైన యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ యుగేందర్‌రెడ్డి తెలిపారు. పెబ్బేరు పట్టణంలోని ఆంబేద్కర్‌ కాలనీకి చెందిన గందం రవికుమార్‌ (25) ఓకేషనల్‌ కాలేజీలో ఇంటర్‌ ధ్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.తండ్రి పక్కీరయ్య వ్యవసాయం చేస్తుంటాడు. తండ్రికి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేసేవాడు. సో మవారం రాత్రి వ్యవసాయ పొలంలో వరి పంటకు నీళ్లు పెట్టడానికి బైక్‌పై వెళ్లి పంటకు నీళ్లు పెట్టి ఇంటికి తిరిగి వస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. ఇంటికి వచ్చి తండ్రికి పొలం దగ్గర కాలికి ఏదో కరచిందని చెప్పాడు. గమ నించిన కుటుంబ సభ్యులు వెంటనే పెబ్బేరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్‌ సలహా మేరకు వనపర్తికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందా డు. తండ్రి పక్కీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

ఉండవెల్లి: మండలంలోని పుల్లూరు శివారు లోని ఎస్వీఆర్‌ వెంచర్‌లో అనుమానాస్పదంగా మద్దిలేటి(50) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కర్నూలు జిల్లా ప్రకాష్‌నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు రైలులో వెళ్తుండగా జోగుళాంబ హాల్ట్‌లో దిగి వెంచర్‌ వద్దకు చేరుకున్నట్లు దర్యాప్తుతో తేలిందన్నారు. అనుమానాస్పద మృతిగా మృతుడి భార్య మద్దమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌ పేర్కొన్నారు.

25 మేకల చోరీ

కల్వకుర్తి రూరల్‌: మండలంలోని ఎల్లికల్‌ గ్రామానికి చెందిన సత్యనారాయణ మేకల దొడ్డి నుంచి 25 మేకలు చోరీ కాగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపా రు. ముందురోజు రాత్రి మేకలను కట్టేసి వెళ్లి మంగళవారం ఉదయం వెళ్లి చూడగా 25 మేక లు కనిపించకపోవడంతో బాధితుడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

గృహ ప్రవేశం రోజునే చోరీ

కల్వకుర్తి టౌన్‌: ఇంట్లో గృహ ప్రవేశం రోజునే దొంగ చోరీకి పాల్పడిన ఘటన పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. వంగూర్‌ మండలంలోని పోల్కంపల్లికి చెందిన లక్ష్మణ్‌ గౌడ్‌ స్థానిక సుభాష్‌నగర్‌ కాలనీలో ఇంటిని నిర్మించుకున్నాడు. సోమవారం గృహ ప్రవేశం చేసి బంధువులకు విందు ఇచ్చాడు. రాత్రి అంతా చుట్టాలతో కబుర్లు చెప్పుకుంటూ ఉండి తెల్లవారుజామున నిద్రలోకి జారుకోగానే దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. ఎలాగోలా ఇంట్లోకి ప్రవేశించిన దొంగ ఇంటి కల్యాణంలో ఉపయోగించిన పుస్తెలతాడు, మెట్టెలతో పాటుగా అక్కడే నిద్రిస్తున్న మహిళ మెడలో ఉన్న 3.5 తులాల మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లాడు. మహిళకు మెళుకువ వచ్చి కేకలు వేసే సరికి గోడలు దూకి పారిపోయాడని బాధితులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దొంగ నాగర్‌కర్నూల్‌ రోడ్డు నుంచి ఇంట్లోకి వచ్చినట్లుగా అక్కడ కాలనీలో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయింది. అయితే దొంగ ముఖం కనపడకుండా మాస్క్‌ను కట్టుకున్నట్లుగా వీడియోలో ఉండగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో

పత్తి కూలీ దుర్మరణం

జడ్చర్ల: పత్తి తీసేందుకు వచ్చిన కూలీ తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన మంగళవారం మండలంలోని నసరుల్లాబాద్‌–చర్లపల్లి రహదారిపై చోటుచేసుకుంది. హన్వాడ మండలం టంకరకు చెందిన పొనగంటిపల్లి నాగమణి(34) తోటి కూలీలతో కలిసి పత్తి తీసేందుకు నసరుల్లాబాద్‌ శివారులోని వ్యవసాయ పొలం వద్దకు ఆటోలో వచ్చారు. పనులు ముగిసిన తర్వాత ఆటోలో తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఎదురుగా వచ్చిన ఓ బైక్‌ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న నాగమణి ఆటో నుంచి జారి రోడ్డుపై పడడంతో అక్కడికక్కడే మృతిచెంది. బైక్‌ నడుపుతున్న వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పొట్టకూటీ కోసం వెళ్తూ మృతి 
1
1/1

పొట్టకూటీ కోసం వెళ్తూ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement