కురుమతిరాయ.. కోటి దండాలు...
అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్టంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర తదితర ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున అర్చకులు ఆలయశుద్ధి, సుప్రభాత సేవ అనంతరం దర్శనానికి అనుమతించగా.. భక్తులు పుష్కరిణిలో స్నానాలు ఆచరించి తడి దుస్తులతో స్వామి, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలువేలుమంగ, ఆంజనేయస్వామి, చెన్నకేశవ స్వాముల ఆలయాల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి ఏర్పాట్లు చేశారు. – చిన్నచింతకుంట
కురుమతిరాయ.. కోటి దండాలు...


