‘సాక్షి’ మ్యాథ్స్‌బీకి అనూహ్య స్పందన
● మహబూబ్‌నగర్‌లోని రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
● హాజరైన విద్యార్థులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు గణితం,చతుర్విద ప్రక్రియలపై ఆసక్తి పెంపొందించేందు కు మంగళవారం ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యాథ్స్‌బీ పోటీ పరీక్షకు అ నూహ్య స్పందన లభించింది. మహబూబ్‌నగర్‌లో ని మౌంట్‌బాసిల్, అపెక్స్ పాఠశాలలో నిర్వహించిన పరీక్షకు విద్యార్థులు అధికసంఖ్యలో హాజరయ్యారు. ఇలాంటి పరీక్షల నిర్వహణతో గణితంపై ఆసక్తి పెంపొందడంతో పాటు అత్యధిక మార్కులు సాధించేందుకు అవకాశం ఉందని పలువురు విద్యార్థులు తెలిపారు. ఇచ్చిన మెటీరియల్ ప్రశ్నలకు సులభంగా సమాధానాలు రాబట్టేందుకు ఎంతో ప్రయోజనంగా ఉందని పేర్కొన్నారు. మౌంట్‌బాసిల్ పాఠశాలలో పరీక్ష నిర్వహణను పాఠశాల డైరెక్టర్ శిరీష, ప్రిన్సిపాల్ సోమశేఖర్‌రెడ్డి తదితరులు పర్యవేక్షించారు.
విద్యార్థులకు ఎంతో ప్రయోజనం
మ్యాథ్స్‌బీ పరీక్ష విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం. కష్టమైన ప్రశ్నలకు సులభంగా జ వాబులు ఎలా రాయాలో తెలు సుకోవచ్చు. గణితంలో సమస్యను పూర్తిస్థాయిలో చేయడానికి వచ్చినప్పటికీ షార్ట్‌కట్‌లో తక్కువ సమయంలో చేసే విధానం తెలుసుకోవచ్చు. మా పాఠశాలలో పరీక్షలు రాసిన చాలామంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కూడా చక్కటి ప్రతిభ కనబర్చారు.
– శ్రీప్రణిత,
ఉపాధ్యాయురాలు, మౌంట్‌బాసిల్ పాఠశాల
‘సాక్షి’ మ్యాథ్స్‌బీకి అనూహ్య స్పందన


