
మహబూబ్‌నగర్
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025
వచ్చేనెల 3న
సీఎం రేవంత్‌రెడ్డి రాక
అడ్డాకుల: వచ్చే నెల 3న మూసాపేటకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. మూసాపేటలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేవరకద్రలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మూసాపేట గ్రామస్తులతో సమావేశమయ్యారు. మూసాపేటలో చివరి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. వచ్చేనెల ప్రారంభం నాటికి ఇళ్ల పనులను పూర్తి చేస్తే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి వాటిని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే గ్రామస్తులకు తెలిపారు. అలాగే మూసాపేటలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనంలో కొనసాగుతున్నందున వాటికి కొత్త భవనాలు, మండల కాంప్లెక్స్ నిర్మాణం పనులకు సీఎం శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అలాగే వేముల శివారులోని ఎస్‌జీడీ ఫార్మా పరిశ్రమ రెండో యూనిట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు శెట్టిశేఖర్, నాయకులు మశ్చందర్‌నాథ్, శ్రీనివాస్‌శర్మ, నారాయణ, విజయ్‌కుమార్, కలీం, జమీర్, సత్యనారాయణ, పాష, సలాం, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: పోలీసులు ఎప్పుడూ పౌరుల సమస్యలను సావధానంగా విని, మర్యాదపూర్వకంగా స్పందించాలని ఎస్పీ డి. జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో 13 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులు ఒక్కొక్కరితో మాట్లాడుతూ వారి సమస్య తెలుసుకుని ఆయా పోలీస్ అధికారు లతో మాట్లాడి వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పరిష్కార స్థితిని క్రమం తప్పకుండా సమీక్షించాలన్నారు. బాధితుల సమస్యలను పరిష్కరించడానికి పోలీస్ యంత్రాంగం 24 గంటలు పని చేస్తోందని పేర్కొన్నారు.
యూరియా
అందుబాటులో ఉంచాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వానాకాలం సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేత కాని తనం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతులు నారుమళ్లు పోసుకుని నాట్లు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ, పురుగు మందు, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ‘స్పెషల్’ బాదుడు
రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ సర్వీసుల పేరిట ఆర్టీసీ టికెట్‌పై 30 శాతం చార్జీలు పెంచారు.
–8లో u
న్యూస్‌రీల్

మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్