పనులు త్వరగా పూర్తి చేయాలి
ఉండవెల్లి: జోగుళాంబ రైల్వే హాల్ట్ నిర్మాణ పనులను గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు పాటించాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. హై లేవల్ ప్లాట్‌ఫాం, విశ్రాంతి గదుల నిర్మాణాలు, ఆలయ ఆకృతిలో ఉన్న పలురకాల డిజైన్ల గురించి అధికారులతో చర్చించి నమూనాలను పరిశీలించారు. టికెట్ బుకింగ్ కౌంటర్ గదులు, మాస్టర్ ప్లాన్ నమూనా, పార్కింగ్ స్థలాలను చూశారు. జోగుళాంబ హాల్ట్ నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరుకావడంతో పనులు చివరి దశకు చేరినట్లు కాంట్రాక్టర్ బీవీఎన్ రెడ్డి తెలిపారు. జూన్ చివరిలోపు పనులు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు వివరించారు. ఆయన వెంట రైల్వే అధికారులు ఉన్నారు.
గద్వాల రైల్వేస్టేషన్‌లో..
గద్వాల: జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా చేపట్టాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అమృత్ భారత్ పథకంలో భాగంగా స్టేషన్‌లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.
జోగుళాంబ హాల్ట్‌ను పరిశీలించిన
జీఎం అరుణ్‌కుమార్ జైన్


