ఉగ్రదాడి హేయమైన చర్య
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిపి 28 మందిని కాల్చి చంపడం హేయమైన చర్య అని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు అన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం రాత్రం స్థానిక అంబేడ్కర్‌చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి ప్రాణాలను తీయడం లాంటి పిరికితనం మరొకటి లేదన్నారు. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వెంటాడి మట్టుబెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ‘ఫోరం’ ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, సభ్యులు రాజసింహుడు, లక్ష్మణ్‌గౌడ్, సురేష్‌బాబు, రాములు, బుచ్చన్న, హన్మంత్‌రెడ్డి, గంగాధర్, కోటేశ్వరరెడ్డి, సురేష్‌బాబు పాల్గొన్నారు.
ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి
కశ్మీర్‌లో పర్యాటకులపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అద్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి కోరారు. బుధవారం రాత్రి బీజేపీ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాండురంగారెడ్డి, రమేష్, అంజయ్య, సంపత్, శివ, గంగన్న పాల్గొన్నారు.
ఉగ్రదాడి హేయమైన చర్య


