సమ్మె నోటీస్ ఇచ్చిన కాంట్రాక్టు అధ్యాపకులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు రిజిస్ట్రార్ రమేష్‌బాబుకు మంగళవారం సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీ ల్లో ఒప్పంద అధ్యాపకులు ఏళ్లుగా యూనివర్సిటీలో పని చేస్తున్నారని, అలాంటి వారిని రెగ్యులరైజ్ చేయాలని, బడ్జెట్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో పనిచేస్తున్న వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం ఉన్న ఫలంగా నోటిఫికేషన్ ఇచ్చి కాంట్రాక్టు అధ్యాపకుల గొంతు నొక్కవద్దన్నారు. శ్రీధర్‌రెడ్డి, భూమయ్య, రవికుమర్, విజయ్‌భాస్కర్, ప్రభాకర్‌రెడ్డి, సోమేశ్వర్, సుదర్శన్‌రెడ్డి, రవికుమార్, మృదుల పాల్గొన్నారు.
రోడ్లపై ధాన్యం ఆరబెట్టొద్దు: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఎక్కడా జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులపై ధాన్యాన్ని పోసి ప్రమాదాలకు కారణం కావొద్దని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి రోడ్ల అయినా ధాన్యం ఆరబెట్టొద్దని, రోడ్లపై ధాన్యం గుట్టలను గమనించలేక ప్రమాదాలకు దారి తీస్తున్నాయని, ప్రధానంగా రాత్రి వేళ ధాన్యంపై నల్ల కవర్ కప్పడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ప్రమాదాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయ ని గుర్తు చేశారు. రైతులు ధాన్యం అరబెట్టే సమయాల్లో రోడ్లను కాకుండా ఇతర అనువైన ప్రదేశాలను ఎంచుకోవాలని సూచించారు.
దేశాభివృద్ధిలో ఆర్థికశాస్త్రం కీలకం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఆర్థికశాస్త్రం దేశాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎకానామిక్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ ఎకానామిక్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎకానామిక్స్ పూర్తిస్థాయిలో ఎగుమతులు, దిగుమతులు వ్యాపార, వాణిజ్య విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీ రాఘవేందర్‌రావు, జిమ్మికార్టన్, శివలింగం, రాజునాయక్ పాల్గొన్నారు.
పోటెత్తిన ధాన్యం
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు మంగళవారం మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. దాదాపు 11 వేల బస్తాల మొక్కజొన్న విక్రయానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.2,261, కనిష్టంగా రూ.1,748 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,321, కనిష్టంగా రూ.4,821, కందులు రూ.5,806, పొద్దుతిరుగుడు రూ.3,114, పెబ్బర్లు రూ.4,500, జొన్నలు రూ.3, 577, ధాన్యం హంస రూ.1,892, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,309, కనిష్టంగా రూ.1,450, ఆముదాలు రూ.గరిష్టంగా రూ.6,321, కనిష్టంగా రూ.6,000 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌కు దాదాపు 6వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,750, హంస గరిష్టంగా రూ.1,769, కనిష్టంగా రూ.1,639, ఆముదాలు గరిష్టంగా రూ.6,030, కనిష్టంగా రూ.6,000 లుగా ధరలు నమోదు అయ్యావి.
హుండీ లెక్కింపు
దేవరకద్ర: చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం హుండీని లెక్కించారు. అధికారులు, గ్రామస్తుల సమక్షంలో హుండీని తెరిచి లెక్కించగా.. మొత్తం రూ.4,13,633 ఆదాయం వచ్చింది. కార్యక్రమరంలో దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఈఓ కవిత, ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ రాఘవేంద్రచార్యులు పాల్గొన్నారు.
సమ్మె నోటీస్ ఇచ్చిన కాంట్రాక్టు అధ్యాపకులు
సమ్మె నోటీస్ ఇచ్చిన కాంట్రాక్టు అధ్యాపకులు


