బావాజీని దర్శించుకున్న ప్రముఖులు
కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలిసిన గురులోకమాసంద్ ప్రభు బావాజీ బ్రహ్మోత్సవాలకు సోమవారం మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హాజరయ్యారు. లోకమాసంద్ ప్రభు బావాజీ, కాళికాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు వారికి పుష్పగుచ్ఛాలు అందేజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర లోకమాసంద్ ప్రభు బావాజీని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల భక్తులు తరలివస్తారని.. రాష్ట్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని, నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయాన్ని విస్మరించారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు శాసం రామకృష్ణ, సలీం, గోపాల్, మధుసూదన్‌రెడ్డి, వీరారెడ్డి, రాజురెడ్డి, నెల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన బావాజీ ఉత్సవాలు
కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న బావాజీ ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. సోమవారం చివరిరోజు ఉదయం అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. అలాగే అమ్మవారైన కాళికాదేవికి కొందరు భక్తులు మేకపోతులు, గొర్రె పొట్టేళ్లు, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు చందర్‌నాయక్, భీమ్లాయాక్, దేవ్లానాయక్, ధన్‌సింగ్ కాళికామాతకు మహా హోమం జరిపారు. గురులోకా మసంద్ బావాజీ, కాళికామాతను సోమవారం సాయంత్రం ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత మొదటిసారి వచ్చిన ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆమె వెంట నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్యయాదవ్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, మదన్, సుధాకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి తదితరులున్నారు.
బావాజీని దర్శించుకున్న ప్రముఖులు
బావాజీని దర్శించుకున్న ప్రముఖులు


