శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
కోయిల్‌కొండ: ఛత్రపతి శివాజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం కోయిలకొండ మండలం రాంపూర్‌లో హిందువాహిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నారాయఫేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అలుపెరగని పోరాటయోధుడు ఛత్రపతి శివాజీ అని కొనిడాయారు. ఆదిత్యపరాశ్రీ స్వామిజీ, విగ్రహ దాత మాజీ సర్పంచ్ కల్పన బచ్చిరెడ్డి, కుమ్మరి రాములు, రవీందర్, రవీందర్‌రెడ్డి, వై.విద్యాసాగర్, విజయ్‌భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.


