ఊర చెరువులో మొసలి
వీపనగండ్ల: మండల కేంద్రం సమీపంలో ఉన్న ఊరచెరువులో మొసలి సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తరచూ బయటకు వస్తుండటంతో అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారు. అధికారులు స్పందించి చెరువు నుంచి తరలించడంతో పాటు హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.
కారులో మంటలు
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగిన ఘటన మంగళవారం ఉదయం పట్టణంలో చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది, బాధితుడి కథనం మేరకు.. పట్టణంలోని వీవర్స్‌కాలనీకి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఉదయం కారును బయటకు తీసే క్రమంలో ఇంజిన్ నుంచి మంటలు వచ్చా యి. గుర్తించిన యజమాని మంటలను అ దుపు చేసేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచా రం ఇచ్చారు. దీంతో ఘటనస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసు కొచ్చారు. షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమా దం జరిగి ఉండొచ్చని ఫైర్‌సిబ్బంది తెలిపారు.
పంటకు పురుగు
మందు కొట్టి.. రైతు మృతి
నవాబుపేట: పంటకు పురుగు మందు కొట్టిన అస్వస్థతకు గురైన ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని లోకిరేవు గ్రామానికి చెందిన రైతు కావలి సత్తయ్య(46) ఈ నెల 3న తన ిపొలంలో పంటకు పురుగు మందు పిచికారీ చేశాడు. రోజంతా పురుగు మందు కొట్టి అస్వస్థతకు గురై పొలం చెంతనే పడిపోయాడు. దీంతో చుట్టుపక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులతో కలిసి 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది కోలుకోవడంతో 5న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చాడు. అయితే మరుసటి రోజు మరోసారి అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స ిపొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ ఘటనపై సత్తయ్య కుమారుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
వ్యక్తి మృతదేహం లభ్యం
అలంపూర్: పట్టణంలోని వంతెన సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున నంద్యాల జిల్లా బనగానపల్లికి చెందిన ఆదిత్య శశాంక్ (33) మృతదేహం మంగళవారం లభ్యమైందని ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించామన్నారు. తల్లి అనాథ శరణాలయంలో ఉందని.. ఇద్దరు అక్కలు ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ఘటన స్థలాన్ని సీఐ రవిబాబు పరిశీలించారు.
ఊర చెరువులో మొసలి


