మినీ ట్యాంక్‌బండ్‌పై అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద అన్ని సౌకర్యాలు కల్పి స్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముడా ఆధ్వర్యంలో సుమా రు రూ.50 లక్షలతో ఏర్పాటుచేసే విద్యుత్ దీపాలకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మినీ ట్యాంక్‌బండ్‌ను రూ.రెండు కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందులో సైకిల్‌ట్రాక్, నడక దారి, గ్రీనరీకి రూ.1.50 కోట్లు కేటాయించామన్నారు. రెండు నెలలలోగా మినీ ట్యాంక్‌బండ్‌ను అన్ని హంగులతో అందుబాటులోకి తెస్తామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నగర ప్రజలకు విజిటింగ్ స్పాట్‌గా మారుస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో నిధుల లేమితో అభివృద్ధి మధ్యలోనే ఆగిపోయిందన్నారు. సాయంత్రం వేళ ఇక్కడికి వచ్చి సేదతీరే వారికి, రాత్రివేళ ఈ దారిలో వెళ్లే బాటసారులు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలు ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్‌కుమార్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, నాయకులు సిరా జ్‌ఖాద్రీ, సీజే బెన్‌హర్, అవేజ్, అజ్మత్‌అలీ, శా ంతయ్యయాదవ్, ఖాజాపాషా, మునీరొద్దీన్, మోసిన్, ఉమర్ ఫరూఖ్, అంజద్, తదితరులు పాల్గొన్నారు.


