మహనీయుల ఆశయసాధనకు కృషి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహనీయుల ఆశయసాధనకు కృషిచేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం బాబు జగ్జీవన్‌రాం 118వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ చౌరస్తాలో ఎస్పీ డి.జానకి, అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్‌లతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జగ్జీవన్‌రాం కేంద్ర మంత్రిగా కార్మిక, రవాణా, ఆహార, వ్యవసాయ, రక్షణ, రైల్వే శాఖ, భారత ఉప ప్రధానిగా కీలక పదవులు నిర్వహించారన్నారు. ఎస్సీ కుల సంఘాలు నాయకులు సమావేశంలో తెలిపిన సమస్యలను ఎస్పీ, జిల్లా యంత్రాంగం ద్వారా పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు. విద్యార్థులు జగ్జీవన్‌రాం, మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని వారి జీవిత చరిత్రలు, సాహిత్యం, మంచి పుస్తకాలను కూడా అధ్యయనం చేయాలన్నారు.
సమాజ నిర్మాణానికి కృషి...
బాబు జగ్జీవన్‌రాం సమ సమాజ నిర్మాణానికి కృషి చేసిన సామాజిక విప్లవ నాయకుడు అని రాష్ట్ర మైనార్టీ ఆర్థిక సంస్థ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగ్జీవన్‌రాం అడుగుజాడల్లో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, పీసీసీ కార్యదర్శి వినోద్‌కుమార్, సంజీవ్ ముదిరాజ్, మంత్రి నరసింహయ్య, మల్లెపోగు శ్రీనివాస్, నరసింహులు, గోపాల్‌మాదిగ, శామ్యూల్, లక్ష్మణ్, కుర్మయ్య, యాదయ్య, డీఆర్డీఓ నర్సింహులు, షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ ఇన్‌చార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల అభివద్ధి అధికారి సుదర్శన్, ఆర్‌డీఓ నవీన్ పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్‌రాంను ఆదర్శంగా తీసుకోవాలి
కలెక్టర్ విజయేందిర బోయి
తెలంగాణచౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి


