రారండోయ్.. వేడుక చూద్దాం
స్టేషన్ మహబూబ్‌నగర్: శ్రీరామ నవమి పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలో సీతారామ కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయాలతో పాటు పలు వీధుల్లో కల్యాణ వేడుకలు జరగనున్నాయి. లక్ష్మీనగర్‌కాలనీలోనిల శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయం, న్యూగంజ్‌లోగల శ్రీలక్ష్మినరసింహస్వామి దేవాలయం, బస్టాండ్ సమీపంలోని ద్వారకామాయి షిరిడీసాయి ఆలయం, టీచర్స్ కాలనీ శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం (రామాలయం), రామమందిరం, తూర్పుకమాన్ వద్దనున్న సీతారామాంజనేయస్వామి దేవాలయం, శ్రీనివాస కాలనీలోని పంచముఖాంజనేయస్వామి దేవాలయం, టీడీ గుట్ట తిరుమలనాథస్వామి ఆలయం, గణేష్‌నగర్‌లోని షిరిడీసాయిబాబా దేవాలయం, రామాంజనేయస్వామి ఆలయం, సంజయ్‌నగర్‌లోని వీరాంజనేయస్వామి ఆలయం, బాలాజీనగర్, నాగేంద్రనగర్, న్యూమోతీనగర్ ఆంజనేయాలయాల్లో, బీకే రెడ్డి కాలనీలోని శివాంజనేయస్వామి ఆలయం, వెంకటేశ్వరకాలనీ హయగ్రీవాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ మహోత్సవానికి హాజరు కావాలని ఆయా ఆలయాల కమిటీ నిర్వాహకులు పిలుపునిచ్చారు.
రారండోయ్.. వేడుక చూద్దాం


