‘కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల మద్దతు’
భూత్పూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల తరుఫున ప్రత్యేక ధన్యవాదాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో దేవరకద్ర నియోజకవర్గస్థాయి యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయరంగాల్లో యాదవుల వాటా కోసం ఉద్యమిస్తామని, ఇందుకు వేదిక రాష్ట్రస్థాయిలో పని చేస్తుందని వివరించారు. జనాభాలో 10 నుంచి 15 శాతం ఉన్న అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్ పేరన 10 శాతం రిజర్వేషన్లు తీసుకోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకుడు వెంకటనర్సయ్య, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు అంజన్నయాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జుర్రు నారాయణ యాదవ్, బత్తుల మల్లేష్ యాదవ్, ఊషన్న యాదవ్, కృష్ణయ్య యాదవ్, రెడ్డికుంట వెంకటేష్ యాదవ్, చందు యాదవ్, నరేందర్ యాదవ్, మందడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


