పెట్టుబడికి అప్పు తెచ్చిన
ఉన్న 1.34 ఎకరాల పొలంలో వరి వేసిన. ఇప్పటి దాక దుక్కులు, దమ్ము, నాట్లకు, మందులకు రూ.40 వేల వరకు పెట్టుబడి ఖర్చులయ్యాయి. రైతు భరోసా డబ్బులు రాగానే ఇస్త అని చెప్పి తెలిసిన కాడ అప్పు తెచ్చిన. రెండునెలల నుంచి ఎదురుచూస్తున్న. రూపాయి రాలే. రైతు భరోసా డబ్బుల కోసం రోజుల బ్యాంకుల చుట్టూ తిరుగుడైతున్నది. మూడెకరాలు ఉన్నోళ్లకు రైతు భరోసా డబ్బులు పడ్డాయట. నాకు 1.34 ఎకరాలే ఉంది. మరి మేమేం పాపం చేసినం. మేము కూడా రైతులమే కదా. మాకెందుకు సాయం చేస్తలేరు. గతంలో గిట్ల లేకుండే. అందరిని సమానంగా చూసిండ్రు.
– నరేష్, రైతు, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్ రూరల్


