యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో యువజన కాంగ్రెస్ విభాగాన్ని బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి అరవింద్‌కుమార్ యాదవ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ దేశవ్యాప్తంగా జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నదని, దీనిని యువజన కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి విజయవంతం చేయాలని కోరారు. హెచ్‌సీయూ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
● అంతకుముందు పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అవేజ్ అహ్మద్ అధ్యక్షతన జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు శివంత్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వాసుయాదవ్, ఆయా అసెంబ్లీ అధ్యక్షులు సల్మాన్, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, సంజీవరెడ్డి, సలావుద్దీన్ ఫైజాన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ యాదవ్


