మానవాళికి మేలు..
బొటానికల్ గార్డెన్‌లో విద్యార్థులు చేసిన పరిశోధనలు మానవాళికి ఎంతో ఉపయోగం కానున్నాయి. ఏ చెట్టు ఎంత కార్బన్ డయాకై ్సడ్ గ్రహిస్తుందో తెలియడం వల్ల.. అలాంటి చెట్లను ఎక్కువగా నాటడానికి అవకాశం దక్కుతుంది. ఇలాంటి పరిశోధన రాష్ట్రంలోనే ఇదే ప్రథమం. మా పరిశోధనలకు జిజ్ఞాసలో తగిన గౌరవం దక్కింది. బొటానికల్ గార్డెన్‌లోని 1,228 చెట్లు 282 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ గ్రహిస్తున్నాయి. మొత్తం మొక్కలను లెక్కిస్తే రెట్టింపు కార్బన్ డయాకై ్సడ్ గ్రహిస్తాయని గుర్తించవచ్చు. దీన్ని ద్వారా భవిష్యత్‌లో భారీగా ఆదాయం సమకూరనుంది. – డా.సదాశివయ్య, పరిశోధనల మెంటర్, గార్డెన్ సమన్వయకర్త


