వృద్ధురాలి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

Mar 27 2025 12:49 AM | Updated on Mar 27 2025 12:49 AM

వృద్ధ

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

ఉప్పునుంతల: మండల కేంద్రంలో బొల్లె శాంతమ్మ (75) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు కుమారుడు బొల్లె వెంకటయ్య ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. శాంతమ్మ మంగళవారం మధ్యాహ్నం ఇంటి ఎదుట స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి కాళ్లు, చేతులతో పాటు శరీర భాగాలపై కాలిన గాయాలు కనిపించడంతో తన తల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుమారుడు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

ఖిల్లాఘనపురంలో

మరో వ్యక్తి..

ఖిల్లాఘనపురం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన పంతగాని కృష్ణయ్య (42) మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. బుధవారం అతడి దహన సంస్కారాలకు కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మృతుడి మోకాళ్ల వద్ద గాయాలు ఉండటం.. శరీరం మొత్తం ఉబ్బి ఉండటంతో అనుమానం వచ్చి దహన సంస్కారాలను నిలిపివేశారు. ఈ విషయమై మృతుడి చిన్నాన్న ఉద్దంగిరి వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సురేష్‌గౌడ్‌ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు.

వ్యక్తి బలవన్మరణం

గోపాల్‌పేట: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బుద్దారం గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేష్‌కుమార్‌ కథనం మేరకు.. గ్రామానికి చెందిన దేశమోని ఆంజనేయులు (28)కు ఐదేళ్ల కిందట రేవల్లికి చెందిన కల్పనతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా రు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి అందరూ కలిసి పడుకున్నారు. బుధవారం ఉదయం లేచి చూసేసరికి ఆంజనేయులు ఇంట్లో ఉరేసుకొని మృతిచెంది కనిపించాడు. తల్లి దేశమోని భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

భూమి వివాదంలో

కత్తితో దాడి

కృష్ణా: మండలంలోని గుడెబల్లూర్‌ గ్రామంలో బుధవారం ఇరువర్గాల మధ్య 5 గుంటల భూ మి విషయంలో పొలం వద్ద పంచాయితీ ని ర్వహించారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మాటమాట పెరిగి ఒక్కసారిగ కత్తితో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఫొటో గ్రాఫర్‌ వాకిటి వివేకానంద్‌, పునాలో నివసించే శంకరప్పలు ఐదుగంటల భూమి విషయంలో పొలం దగ్గర పంచాయతీ ని ర్వహించారు. ఇరువురి మధ్య మాటమాట పెరిగి శంకరప్ప కత్తితో వివేకానంద్‌పై దాడి చేశాడు. వెంటనే గాయపడిన అతను కృష్ణా లోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఇరువర్గాల వా రు స్టేషన్‌కు చేరారు. ఫిర్యాదు ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ ఎండీ నవీద్‌ తెలిపారు. ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని అన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

మద్దూరు/కొత్తపల్లి: కొయిలకొండ మండలంలోని శేరి వెంకటాపూర్‌ నుంచి వాహనంలో రేషన్‌ బియ్యం 9.90 క్వింటాళ్లు మద్దూరుకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేర కు పోలీసులు కొత్తపల్లి మండలంలోని దుప్పట్‌గట్‌ దగ్గర పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ఆనంద్‌ బియ్యా న్ని పంచనామా నిర్వహించారు. మద్దూరులోని రేషన్‌ డీలర్‌ సంజీవరెడ్డికి అప్పగించారు. రేషన్‌కార్డుదారుల నుంచి రూ.12 కొని మద్దూరు లోని మాల వెంకటప్ప కర్ణాటకకు కిలో రూ.16 చొప్పున అమ్ముతున్నట్లు అధికారులకు తెలిపారు. రేషన్‌ బియ్యాన్ని తరలించిన వాహనా న్ని, రేషన్‌ బియ్యం సేకరించిన వెంటకప్పపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.

సారా స్థావరాలపై దాడులు

చారకొండ: మండలంలోని గోకారం, చారకొండ, రాంపురం గ్రామాల సమీపంలో ఎకై ్సజ్‌ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు బుధవారం సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, పది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సంజ్‌ సీఐ జె.వెంకట్‌ రెడ్డి తెలిపారు. గోకారం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశామన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ కృష్ణ, సిబ్బంది, నర్సింహ్మ, రుక్యా, రఘు, నార్య, పరమేష్‌, భీమమ్మ ఉన్నారు.

వృద్ధురాలి  అనుమానాస్పద మృతి 
1
1/1

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement