మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి శివేంద్రప్రతాప్ ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాలం కావడంతో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రావొద్దన్నారు. ఎక్కడైనా లీకేజీలుంటే వెంటనే బాగు చేయించాలని, విద్యుత్ మూడో వైరును ఏర్పాటు చేసి, వీధి దీపాలు సమయానికి వెలిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ ఎంఈ సందీప్, డీఈఈ నర్సింహ, ఏఈలు వైష్ణవి, నుస్రత్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శివశక్తినగర్‌లో ఓపెన్ నాలాను పరిశీలించి వెంటనే డ్రెయినేజీ నిర్మించాలని ఆదేశించారు. అలాగే వన్‌టౌన్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించి కమిషనర్‌కు తగు సూచనలిచ్చారు.