పాలమూరు: రాష్ట్రంలో వెంటనే న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ మంగళవారం న్యాయవాదులు కోర్టులో విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తొలుత కోర్టు ఎదుట ఆందోళన చేసి.. అక్కడి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల హత్యలను ప్రభుత్వం నివారించాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే చాలా చోట్ల న్యాయవాదులపై ప్రత్యక్ష దాడులు, హత్యలు జరగడం బాధాకరమన్నారు. మాజీ అధ్యక్షుడు అనంతరెడ్డి, చంద్రమౌళి, అనిల్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం తెస్తూ, న్యాయవాదులపై జరిగిన దాడులపై ఫాస్ట్‌ట్రాక్ట్ కోర్టుల ద్వారా విచారించాలన్నారు. ఈ కేసులలో ఉన్న నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి న్యాయవాదుల సమస్యపై శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రవికుమార్, పుట్టపాగ రఘుపతి, నరేందర్‌గౌడ్, కాంతారెడ్డి, ఎన్.పీ వెంకటేష్, జాకీర్ హుస్సెన్, ఉమా మహేశ్వరి, జ్యోతి, రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.
కోర్టు విధులుబహిష్కరించి, నిరసన తెలిపిన న్యాయవాదులు