పాలమూరు: జిల్లాకేంద్రంలోని బాలసదన్ గృహాన్ని మంగళవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సందర్శించారు. వసతులు, సౌకర్యాలపై ఆరా తీయడంతో పాటు చిన్నారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారా? లేదా అనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేట్ హోం సందర్శించి అక్కడ నల్సా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ చిల్డ్రన్ అండ్ ప్రొటెక్షన్ స్క్రీంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల హక్కులు, బాల్య వివాహాలు తదితర చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.
వారం రోజుల్లో 1,052 మంది రక్తదానం
పాలమూరు: షహీద్ దివాస్ సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి 23వరకు చేపట్టిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించిందని రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 1,052 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారిని రక్తదానం ద్వారా కాపాడుకోవచ్చని, యుక్త వయసులో ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేసి బాధ్యత చాటుకోవాలని సూచించారు.
ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర రూ.2,205
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన ఈ టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,205, కనిష్టంగా రూ.1,909గా పలికింది. యాసంగి సీజన్ వరి ధాన్యం కోతకు రావడంతో రైతులు వచ్చిన దిగుబడులను మార్కెట్‌కు తీసుకురావడం ప్రారంభించారు. దాదాపు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఉల్లిపాయల బహిరంగ వేలం ప్రారంభం అవుతుంది.
వేరుశనగ క్వింటాల్ రూ.6,411
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,411, కనిష్టంగా రూ.5,100 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,792, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,281, కనిష్టంగా రూ.1,791 ,జొన్నలు గరిష్టంగా రూ.4,328, కనిష్టంగా రూ.3,070, ఆముదాలు గరిష్టంగా రూ.6,300, కనిష్టంగా రూ.5,870, మినుములు రూ.7,260 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,205, కనిష్టంగా రూ.1,909గా పలికింది. యాసంగి సీజన్ వరి ధాన్యం కోతకు రావడంతో రైతులు వచ్చిన దిగుబడులను మార్కెట్‌కు తీసుకురావడం ప్రారంభించారు. దాదాపు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. బుధ వారం ఉదయం 10 గంటల నుంచి ఉల్లిపాయల బహిరంగ వేలం ప్రారంభం అవుతుంది.
ఏఐ బోధనతో విద్యార్థులకు మేలు
● డీఈఓ ప్రవీణ్‌కుమార్
మిడ్జిల్: ప్రభుత్వ పాఠశాలలో ఏఐ విద్యా బోధనతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని డీఈఓ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో, వల్లభ్‌రావుపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్‌ను ప్రారంభించారు. చదువులో వెనుకబడిన 3, 4, 5 తరగతుల విద్యార్థుల కోసం ఏఐ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు ఈకార్యక్రమాన్ని విద్యార్థులకు సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జ్యోతి అల్వాల్‌రెడ్డి, శ్రీనివాసులు, సీఎంఎ బాలుయాదవ్, ఎంఈఓ వెంకటయ్య, హెచ్‌ఎం సరస్వతి పాల్గొన్నారు.
బాలల హక్కులపై అవగాహన
బాలల హక్కులపై అవగాహన