మహబూబ్‌నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఈ నెల 25 నుంచి 29 వరకు జరగనున్న జాతీయస్థాయి సీనియర్ టెన్నికాయిట్ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. హనుమకొండలో ఈనెల 15 నుంచి 17 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ టెన్నికాయిట్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన యాసిన్, సుజాయత్, మమత, జాష్నవి, శ్రీనిధిలు ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం క్రీడాకారులు జాతీయపోటీలకు బయలుదేరగా వీరిని జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లయన్ నటరాజ్, వడెన్న, పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశ్విని చంద్రశేఖర్ అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
జాతీయస్థాయి టెన్నికాయిట్ పోటీలకు జిల్లా క్రీడాకారులు