దేవరకద్ర: స్థానిక పురపాలికకు సంతల వేలం ద్వారా రూ.69. 38 లక్షల ఆదాయం సమకూరింది. గురువారం పుర కార్యాలయం వద్ద వేలం పాట నిర్వహించగా మహబూబ్‌నగర్, దేవరకద్ర పుర కమిషనర్లు మహేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మేనేజర్ సీత్యానాయక్ పాల్గొన్నారు. వేలంలో పశువుల సంతను రూ.47.96 లక్షలకు పట్టణానికి చెందిన ఆది హన్మంత్‌రెడ్డి దక్కించుకున్నారు. అలాగే గొర్రెలు, మేకల సంతను రూ.15.36 లక్షలకు కుర్వ రాంపాండు, తైబజార్‌ను రూ.6.06 లక్షలకు కుర్వ బీరప్ప దక్కించుకున్నారు. పురపాలిక నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువగా రావడంతో వాయిదా లేకుండా కాంటాక్టులను ఖరారు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2026, మార్చి 31 వరకు కాంటాక్టు అమలులో ఉంటుందని అధికారులు వివరించారు.