
మాట్లాడుతున్న కర్ణాటక మంత్రి బోసురాజు
మక్తల్: తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని కర్ణాటక రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి బోసురాజు అన్నారు. శనివారం పట్టణంలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి ఇంట్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని ఓటింగ్ సరళిపై ఆరాతీశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని.. ప్రజలు పట్టం కట్టడం ఖాయమని తెలిపారు. పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తామని.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని వివరించారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవికుమార్‌యాదవ్, కుర్మయ్య, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక మంత్రి బోసురాజు