ప్రతిభ చాటిన జిల్లా పోలీసులు | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ చాటిన జిల్లా పోలీసులు

Nov 29 2026 1:34 PM | Updated on Nov 29 2026 1:34 PM

మహబూబాబాద్‌ రూరల్‌: తెలంగాణ పోలీసు డ్యూటీ మీట్‌లో జిల్లా పోలీసు సిబ్బంది ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంతోపాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వివిధ విభాగా ల్లో పతకాలు సాధించిన ముగ్గురు పోలీసు సిబ్బందిని ఎస్పీ శబరీష్‌ అభినందించారు. మానుకోట ట్రాఫిక్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చీర్ల అరుణ్‌కుమార్‌ ఐటీ ప్రొఫిషియెన్సీ (కంప్యూటర్‌ ప్రో గ్రామింగ్‌) విభాగంలో ప్రతిభ కనబరచి సిల్వర్‌ మెడల్‌ సాధించారు. అరుణ్‌ కుమార్‌ గత ఏడాది 2వ తెలంగాణ రాష్ట్ర పోలీసు డ్యూటీ మీట్‌లో కాంస్య పతకం సాధించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ విభాగంలోని బాంబ్‌ డిటెక్షన్‌ అండ్‌ డిస్పోజల్‌ స్కాడ్‌ జిల్లా ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కొంపల్లి అంజయ్య 3వ తెలంగాణ రాష్ట్ర పోలీసు డ్యూటీ మీట్‌ సహాయ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. డిసెంబరు 15 నుంచి ముంబైలో జరిగే 70వ ఆల్‌ ఇండియా పోలీసు డ్యూటీ మీట్‌లో యాంటి సబ్‌ టేజ్‌ చెక్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా వెళ్లనున్నాడు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఏఆర్‌ విభాగం బాంబ్‌ డిటెక్షన్‌ అండ్‌ డిస్పోజల్‌ స్కాడ్‌ కానిస్టేబుల్‌ గట్టిగోర్ల అశోక్‌ రాష్ట్ర 3వ పోలీసు డ్యూటీ మీట్‌లో ప్రతిభ కనబరచి కాంస్య పతకం సాధించి ఆల్‌ ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌కు ఎంపికయ్యారు.

అరుణ్‌ కుమార్‌ అంజయ్య అశోక్‌

జాతీయ స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌కు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement