గంగారం మండలం కొడిశాలమిట్ట అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన ఓ బాలుడు కలెక్టర్‌తోనే శభాష్ అనిపించుకున్నాడు.. కేంద్రానికి తనిఖీ నిమిత్తం వచ్చిన కలెక్టర్ స్నేహశబరీష్.. మీ అంగన్‌వాడీ ఎప్పుడు తీశారు, టీచర్ ఎప్పుడు వస్తుందని ఓ పిల్లాడిని అడిగారు.. దీంతో స్కూల్ టీచర్ ఈ రోజే వచ్చింది, అంగన్‌వాడీ ఇప్పుడే తీశారు, ఇన్ని రోజులు రాలేదు. పాఠాలు చెప్పరు.. అని సమాధానమిచ్చాడు. టీచర్ ఇంతవరకు ఏం చెప్పారు అని కలెక్టర్ అడగ్గా.. నాకు అ ఆ ఇ ఈ లు మాత్రమే వచ్చు, టీచర్ ఇంతవరకే చెప్పిందని సమాధానమిచ్చాడు. అడిగిన ప్రశ్నలకు నిజాయితీ గా జవాబిచ్చిన బాలుడిని మెచ్చుకున్న కలెక్టర్.. బహుమతి ఇవ్వడంతో ఆ బుడ్డోడి ఆనందానికి అవధులు లేవు. – సాక్షి, మహబూబాబాద్


