కేయూ క్యాంపస్ : విద్యార్థులు కేవలం ఉద్యోగాలు సాఽధించడమే లక్ష్యంగా పెట్టుకోకుండా కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేపట్టాలని, ఉద్యోగాల కో సం ఎదురుచూడకుండా ఉద్యోగాలు కల్పించే స్థా యికి ఎదగాలని యూనివర్సిటీ చాన్స్‌లర్, గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో స్నాతకోత్సవంలో మాట్లాడారు. వ్యక్తిగత అభివృద్ధితోపాటు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీ సుకోవాలన్నారు. ప్రజాసేవ గొప్ప బాధ్యతన్నారు. రాజకీయాలు వృత్తి మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యతని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతీ పౌరుడు తాను సమాజం, దేశానికి ఏమి అందిస్తున్నాననే విషయం ఆలోచించాలన్నారు. కృత్రిమ మేధస్సు విశ్లేషణ సమస్యల పరిష్కారంలో స హాయ పడుతుందన్నారు. తుది నిర్ణయాలను తీసుకోవాల్సిన బాధ్యత మానవాళిదేనన్నారు. పరిశోధనలు వ్యక్తిగతంగా కాకుండా సమాజం, దేశ ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకుని చేపట్టాలన్నారు.
విద్య, పరిశోధనానైపుణ్యాభివృద్ధి
ఆవిష్కరణలతో..
కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ విద్య, పరిశోధన నైపుణ్యాభివృద్ధి ఆవిష్కరణలతో కాకతీయ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. యూ నివర్సిటీ ఆవిర్భవించి ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుందని, న్యాక్ ఏగ్రేడ్‌ప్లస్‌తో గుర్తింపు పొందిందన్నారు. ప్రతీఏడాది అన్ని కోర్సులు కలిపి కేయూ పరిధిలో 31రకాల డిగ్రీ కోర్సులతో లక్షా ఐదువేల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. డిగ్రీ, పీజీ పాఠ్య ప్రణాళికలను సవరించి ఇంటర్నెషిప్‌లు, నైపుణ్యాల అభివృద్ధి, ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం కల్పించినట్లు తెలిపారు. స్నాతకోత్సవంలో వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ సీపీ శ్వేత, బల్దియా కమి షనర్ వెంకన్న, కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ప రీక్షల నియంత్రణాధికారి రాజేందర్, కేయూ సెనె ట్, పాలకమండలి సభ్యులు మాజీ వీసీలు విద్యావతి, వెంకటరత్నం, సాయన్న, డీన్లు వెంకట్రామ్‌రె డ్డి, సురేశ్‌లాల్, ప్రసాద్, శ్రీనివాస్, రాంనాఽథ్ కిషన్, కిశోర్, పాలకమండలి సభ్యులు మల్లంనవీన్, అనితారెడ్డి, రమ, కుసుమకుమారి, సుధాకర్, సుదర్శన్, బాలు చౌహాన్, చిర్రా రాజు, అకడమిక్ సెనెట్ సభ్యులు జగదీశ్, మాణిక్యం, టీచింగ్, నాన్ టీచింగ్, అతిథులు, స్వర్ణపతక దాతలు, పీహెచ్‌డీ పట్టా లు అందుకున్న అభ్యర్థులు పాల్గొన్నారు.
ఆవిష్కరణలు, నైపుణ్యాలే భవిష్యత్ అభివృద్ధికి పునాదులు
సైయంట్ సంస్థ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సంప్రదాయ విద్యతోపాటు నూతన నైపుణ్యాలు అలవర్చుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికరంగంలో వస్తున్న మార్పులు ఉద్యోగ, ఉపాధి అవకా శాల స్వరూపాన్ని మార్చుతున్నాయన్నారు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికత, సమాచార సాంకేతిక రంగాలు కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయన్నారు. ఈమార్పులకనుగుణంగా విద్యార్థులు నిరంతరం తమ జ్ఞానాన్ని నవీకరించుకోవాలని సూచించారు.
రాజకీయాలు వృత్తి మాత్రమే కాదు
సేవచేసే బాధ్యత
కేయూ స్నాతకోత్సవంలో గవర్నర్
శివప్రతాప్ శుక్లా


