నాలుగు బంగారు పతకాలు అందుకున్న జడ్జి, అడ్వకేట్..
కేయూ క్యాంపస్ : గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకుంటామని భావించి వచ్చిన అభ్యర్థులకు నిరాశే ఎదురైంది. శనివారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎడ్యుకేషన్, ‘లా’ విభాగాల్లో 88 మందికి, అలాగే అదే విభాగాల్లో 2021–2022,2022–2023,2024–2025 అభ్యర్థులకు 408మందికి బంగారు పతకాల ప్రదానానికి స్నాతకోత్సవం నిర్వహించారు. బంగారు పతకాలు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అందజేశారు. వారు ఆడిటోరియంలో తమకు ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చున్నారు.
హడావిడిగా పట్టాల ప్రదానం..
88 మందికి గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టాల ప్రదానం ఉంటుందని భావించారు. బంగారు పతకాలు మాత్రం ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నందున వేదిక మీదికి విభాగాల వారీగా పిలిచి గవర్నర్‌తో బ్యాచ్‌ల వారీగా ఫొటోసెషన్ జరగాల్సి ఉంది. అయితే తొలుత వీసీ ప్రతాప్‌రెడ్డి, ఆ తర్వాత ముఖ్యఅతిథి సైయెంట్ వ్యవస్థాపకుడు మోహన్ రెడ్డి ప్రసంగించాక గవర్నర్ శివప్రతాప్‌శుక్లా 40 నిమిషాలకు పైగా ప్రసంగించారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది. నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ గడిచిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం 1: 05 నిమిషాలకు విభాగాల వారీగా పీహెచ్‌డీ అభ్యర్థులను పిలిచారు. వేదికమీద ముందుగానే అభ్యర్థులకు సిబ్బంది పట్టాలు ఇవ్వగా వాటిని తీసుకుని వరుసగా అభ్యర్థులు గవర్నర్ వద్దకు వచ్చి ఫొటోలు దిగుతున్నారు. ఇది ఒక విభాగంలోని ఒకేసారి పిలిచి గ్రూప్ ఫొటో దిగాలని సూచించారు. అయితే అభ్యర్థులు పట్టాలు తీసుకుని గవర్నర్ వద్దకు వెళ్లగానే అక్కడ ఉన్న గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది త్వరగా వెళ్లాలంటూ వారిని పక్కకు వెళ్లమనడంతో పట్టాల ప్రదానం హడావిడిగా కొనసాగింది. ఫలితంగా అభ్యర్థుల్లో నిరాశ కలిగింది. పీహెచ్‌డీ అభ్యర్థులకు 12 నిమిషాల్లోనే ప్రదానం అయిపోయింది. ఎక్కువ మంది అభ్యర్థులకు గవర్నర్‌తో గ్రూప్ ఫొటోకూడా దిగే అవకాశం లేకుండాపోవడంతో ఆయా అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
కొంతసేపు గందరగోళం..
పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాల ప్రదాన కార్యక్రమం కీలకమైనప్పటికీ ఆ ప్రక్రియను కేవలం 25 నుంచి 30 నిమిషాల్లోనే ముగించారు. స్నాతకో త్సవం వేడుకలకు కనులపండువగా కొనసాగాల్సిండగా హడావుడిగా చేయడంతో ఎక్కెడెక్కడినుంచో వచ్చిన అభ్యర్థులు, తమ కుటుంబీకులు కూడా నిరాశకు గురయ్యారు. కొందరి పేర్లు కూడా చదవలేదు. హడావిడిగా గ్రూపులుగా వేదిక మీదికి పంపి వెంటనే అక్కడి నుంచి వెళ్లమనడంతో కొంతసేపు గందరగోళంగా మారింది. దీంతో కొందరు అభ్యర్థులు తమ గురువులు, కుటుంబీకులతో ఫొటోలు ది గారు. మధ్యాహ్నం 1: 30 గంటలకు స్నాతకోత్స వం ముగిసింది. 88 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు, 373 మంది అభ్యర్థులు బంగారు పతకాలు అందుకున్నారు.
గవర్నర్ చేతులమీదుగా అందుకోలేదని ఆవేదన
పట్టాలు, బంగారు పతకాల ప్రదానంలో హడావిడి
వేదిక మీదకు వెళ్లగానే అభ్యర్థులను
వెంటనే పంపిన భద్రతాసిబ్బంది
88 మంది పీహెచ్‌డీ అభ్యర్థులకు పట్టాలు
373 మందికి బంగారు పతకాలు
కేయూ 24వ స్నాతకోత్సవంలో పలువురు నాలుగు బంగారు పతకాలు అందుకున్నా రు. అంబటి ప్రణయ మూడేళ్ల ‘లా’ కో ర్సు పూర్తిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఉప్పల్‌లోని ఓ కోర్టులో జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2023లో ‘లా’ కోర్సులో నాలుగు బంగారు పతకాలు సాధించారు.అంబటి ప్రణయది వరంగల్ జిల్లా నర్సంపేట. హనుమకొండకు చెందిన అడ్వకేట్ ముదిగుంట్ల సాయితేజరెడ్డి ఎల్‌ఎల్‌బీలో రెండు బంగారు పతకాలు,ఎల్‌ఎల్‌ఎంలో రెండు బంగారు పతకాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన పీహెచ్‌డీ పరి శోధకుడిగా కూడా ఉన్నారు.
మ్యాథ్స్‌లో ఇద్దరికి నాలుగు బంగారుపతకాలు
కేయూ ఎమ్మెస్సీ మ్యాథ్స్‌లో ఎండీ కరిష్మాబేగం, ఎం. నాగలక్ష్మి నాలుగు బంగారు పతకాలు అందుకున్నారు. వారు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు.


