కనులపండువగా సీతారాముల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా సీతారాముల కల్యాణం

Nov 29 2026 1:34 PM | Updated on Nov 29 2026 1:34 PM

లింగాలఘణపురం: రెండో భద్రాద్రిగా పేరుగాంచిన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం జీడికల్‌ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సీతారాముల కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మొదలైన కల్యాణతంతు రెండు గంటల పాటు నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తలంబ్రాలు, ఆలయ కమిటీ చైర్మన్‌ గుర్రం బాలరాజు, సర్పంచ్‌ కొండబోయిన మమతసంపత్‌, ఈఓ వంశీ పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. వేదపండితులు విజయసారథి, శ్రీనివాసాచార్యులు,సురేశ్‌కుమారాచార్యులు, రాఘవాచార్యులు, భిక్షమాచార్యుల వేదమంత్రాలతో కల్యాణోత్సవం జరగగా వేలాది మంది భక్తులు తిలకించి పులకించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వపరంగా మూడేళ్లుగా రూ.3 కోట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. మరింత అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. మూడుసార్లు తంబ్రాలు, పట్టువస్త్రాలు మోసే భాగ్యం కలగడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా డీసీపీ రాజమహేంద్రనాయక్‌ ఆధ్వర్యంలో ఏసీపీ భీంశర్మ, సీఐ వేణు, స్థానిక ఎస్సై కె.కిశోర్‌ బందోబస్తు నిర్వహించారు. కల్యాణోత్సవంలో దేవాదాయ ఏసీ భాస్కర్‌, ఆర్డీఓ గోపీరామ్‌, దేవస్థాన డైరెక్టర్లు యు.వెంకన్న, ఎస్‌.నర్సింహులు, కె. మల్లేశం, ఎ.బుచ్చిరెడ్డి, బి.శ్రీనివాస్‌, వై.యాకూబ్‌, జి.సుధాకర్‌రెడ్డి, ఆర్‌.నారాయణ, పి.మహేశ్‌, కె.నాగరాజు, ఎస్‌. అంజమ్మ, జి.విద్యాసాగర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఆలయ ఈఓ వంశీ, సిబ్బంది భరత్‌, మల్లేశం, శంకర్‌, రమేశ్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

భక్తిపారవశ్యంతో పులకించిన

జీడికల్‌ వీరాచల ఆలయం

మూడోసారి పట్టువస్త్రాలు

సమర్పించడం పూర్వజన్మసుకృతం:

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement