ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేస్తున్న బీజేపీ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేస్తున్న బీజేపీ

Nov 29 2026 1:34 PM | Updated on Nov 29 2026 1:34 PM

హన్మకొండ చౌరస్తా : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేస్తూ, సామాన్యుల ఓటు హక్కును హరించే ప్రయత్నం చేస్తోందని ఏఐసీసీ అబ్జర్వర్‌ కేబీఆర్‌ నాయుడు విమర్శించారు. కర్నాటక, మహారాష్ట్ర, హరియణా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలకు సంబంధించిన అవకతవకలను రాహుల్‌ గాంధీ ఆధారాలతో ప్రజల ముందుంచారని ఆయన పేర్కొన్నారు. హనుమకొండ డీసీసీ భవన్‌లో శనివారం నిర్వహించిన ‘ఓట్‌ బచావో – దేశ్‌ బచావో, ఫేజ్‌–3 వరంగల్‌ క్లస్టర్‌ సమావేశం’లో వరంగల్‌ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, డివిజన్‌ అధ్యక్షులతో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌ రెడ్డి, కె.ఆర్‌ నాగరాజు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, దుద్దిళ్ల శ్రీనివాస్‌, మహమ్మద్‌ ఆయూబ్‌ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్జర్వర్‌, టీపీసీసీ కోఆర్డినేటర్‌ కేబీఆర్‌ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సామాన్యుల ఓటు హక్కును పరిరక్షించాలనే లక్ష్యంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ నాయకత్వంలో ఓట్‌ బచావో – దేశ్‌ బచావో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం ముందుండాలని, ప్రతీ అర్హుడైన ఓటరుకు తన ఓటు హక్కు దక్కేలా కాంగ్రెస్‌ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఓటు హక్కు పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలి

కాంగ్రెస్‌ పార్టీకి బూత్‌ లెవల్‌ ఏజెంట్లే ప్రధాన బలమని, ఓటు హక్కు పరిరక్షణలో వారి పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో బీఎల్‌ఏలు శ్రమించి పనిచేస్తున్నారన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఈవీ శ్రీనివాస్‌ రావు, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ వెంకట్రాజం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ ఖాన్‌, ఎనుమాముల మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ప్రియాంక, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఏఐసీసీ అబ్జర్వర్‌ కేబీఆర్‌ నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement