● చొరవ తీసుకుని అంత్యక్రియలు పూర్తి చేసిన గ్రామస్తులు
● కర్మకాండకు వచ్చిన కుమారుడిని వెళ్లగొట్టిన పలువురు
నర్మెట(తరిగొప్పుల): పేగు బంధం, మానవత్వం మరిచి తల్లి మరణిస్తే తనయుడు కనీసం కడసారి చూపునకు, అంత్యక్రియలకు రాకపోవడంతో ఆ గ్రామమే ఆ మాతృ మూర్తికి సంతానమై అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకుంది. జనగామ జిల్లా తరిగొప్పుల మండలకేంద్రానికి చెందిన నాగబండి పుష్పనీల అనార్యోగంతో సోమవారం మృతి చెందింది. ఈ ఘటనపై గ్రామస్తులు హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడు ఉపేందర్, కూతుళ్లకు సమాచారమందించారు. అయితే కుమారుడు అంత్యక్రియలకు హాజరుకాక పోగా హాజరైన కూతుళ్లు తల్లికి తలకొరివి పెట్టడానికి నిరాకరించారు. దీంతో గ్రామస్తులు చొరవ తీసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, కర్మకాండ నిమత్తం శనివారం ఉపేందర్ రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు అతడిని వెళ్లగొట్టారు.
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
● చిల్పూరులో ఘటన
చిల్పూరు: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జి ల్లా చిల్పూరులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త నారగోని రవి చంద్ర (34) భార్య విదేశాల్లో ఉంది. ఈ క్రమంలో భార్య, మామతో గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం హనుమకొండలోని మామ ఇంట్లో ఉంటున్న తన నాలుగేళ్ల కుమారుడిని చూసేందుకు వెళ్లగా రానివ్వ లేదు. దీంతో మనస్తాపానికి గురైన రవిచంద్ర శుక్రవారం రాత్రి మిత్రులందరిని కలిసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, రవిచంద్ర ఆత్మహత్య విషయం తెలిసిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య జనగామ ఏరియా ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించారు.


