అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Nov 29 2026 1:34 PM | Updated on Nov 29 2026 1:34 PM

● గిరిపురం లింక్‌ రోడ్డులో ఘటన

మరిపెడ రూరల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండం గిరిపురం లింక్‌రోడ్డులో వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఎలమంచలితండాకు చెందిన గుగులోత్‌ శ్రీరామ్‌ (38) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుమారు 17 ఏళ్ల క్రితం వెంకంపాడు గ్రామానికి చెందిన అనితను వివాహం చేసుకోగా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శ్రీరామ్‌ తరచూ మద్యం సేవించి గొడవ పడుతుండడంతో తట్టుకోలేక భార్య నాలుగేళ్ల క్రితం భర్తను విడిచి ఖమ్మం పట్టణానికి వెళ్లి అక్కడ కూలి చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో భార్యను తిరిగి కాపురానికి రావాలని పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా ఫలితం లేకపోడంతో శ్రీరామ్‌ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి ఖమ్మంలోని భార్య వద్దకు వెళ్లి గొడవ పడుతుండగా, ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం తెలియజేసింది. కాగా, శనివారం తెల్లవారుజామున గిరిపురం లింక్‌ రోడ్డులో శ్రీరామ్‌ విగతజీవిగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీరామ్‌ మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడిస్తామని ఎస్సై బానోత్‌ వెంకన్న తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement