● ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్
కురవి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేయడంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. కురవి మండల కేంద్రంలో సీసీ రోడ్లను ప్రారంభించారు. రెండు వీఓ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏం చేసారో ప్రజలకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులకు తెలుసన్నారు. ఆడబిడ్డలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని సూచించారు. కురవిలో కోతుల బెడదను రూపుమాపాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, ఉప సర్పంచ్ ఎర్ర నాగేశ్వర్‌రావు, తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ వీరబాబు, వార్డు సభ్యులు దడిగల స్వప్న, ఆమెడ మల్లికార్జున్, బాదె వీరభద్రం, ఏపీఎం దుర్గారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్, బండి శ్రీనివాస్, నాయకులు నారాయణ రాజేందర్‌కుమార్, గార్లపాటి భరద్వాజ్‌రెడ్డి, వీరిశెట్టి ఉపేందర్, రఘు, డాక్టర్ కరుణాకర్, బాదె శ్రీనివాస్, డ్వాక్రా గ్రూపు మహిళలు స్వరూప, రేణుక, బాదె ఉమ, కానుగంటి పద్మ, సోమలక్ష్మి, బాదె సుజాత, మామిడాల అలేఖ్య, శ్రీదేవి పాల్గొన్నారు.


