అశాసీ్త్రయంగా కరువు మండలాల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అశాసీ్త్రయంగా కరువు మండలాల ఎంపిక

Nov 25 2026 3:42 AM | Updated on Nov 25 2026 3:42 AM

తొర్రూరు: కరువు మండలాల ఎంపిక అశాసీ్త్రయంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గునిగంటి రాజన్న అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. రాజన్న మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయి రైతులు కరువు కోరల్లో చిక్కుకుంటున్నారన్నారు. అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన జిల్లాలోని పలు మండలాలను జాబితాలో చేర్చకపోవడం విడ్డూరమన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలన్నారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యుడు బొల్లం అశోక్‌, మండల కార్యదర్శి ఎండీ యాకూబ్‌, నాయకులు సోమిరెడ్డి, జమ్ముల శ్రీను, దర్గయ్య, స్వామి, మమత పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

ఖమ్మం సహకారనగర్‌: గెస్ట్‌ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ కళాశాలల గెజిటెడ్‌ టీచర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు, తెలంగాణ కళాశాల ఎడ్యుకేషన్‌ జేఏసీ(టీసీఈ జేఏసీ) చైర్మన్‌ డాక్టర్‌ కడారు సురేందర్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జి ల్లాల డిగ్రీ కాలేజీల్లోని గెస్ట్‌ లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళనాన్ని ఖమ్మం ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గెస్ట్‌ లెక్చరర్లకు 12నెలల పాటు నెలనెలా వేతనం అందేలా చూడడంతో పాటు ఏటా ఇంటర్వ్యూ విధానాన్ని సంస్కరించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌గా అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలల బడ్జెట్‌ విడుదల చేయించామని తెలిపారు. జేఏసీ సెక్రటరీ జనరల్‌ ప్రొఫెసర్‌ జి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. చిక్కుముడిగా ఉన్న గెస్ట్‌ లెక్చరర్ల వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం సంఘం పూర్వ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గోపి, జేఏసీ అడిషనల్‌ సెక్రటరీ జనరల్‌ నాగరాజు మాట్లాడగా ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్‌కుమార్‌, సూరంపల్లి రాంబాబుతో పాటు కిరణ్‌కుమార్‌, రామకృష్ణారెడ్డి, వెంకన్న, అభిజిత్‌దేవ్‌, రాజిరెడ్డి, అప్పారావు, వేణు కృష్ణ, వీరునాయక్‌, రమేష్‌నాయక్‌ పాల్గొన్నారు.

కీర్తి పురస్కారానికి పొట్లపల్లి శ్రీనివాసరావు ఎంపిక

హన్మకొండ కల్చరల్‌: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి నగరానికి చెందిన కవి, రచయిత, తెరసం వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఈ మేరకు ఈనెల 26న హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకోనున్నారు. పొట్లపల్లి శ్రీనివాసరావు ఇటీవల తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కాళోజీ ఫౌండేషన్‌ సంయుక్త కార్యదర్శిగా, మిత్రమండలి తదితర సాహిత్య సాంస్కృతిక కళారంగ సంస్థల్లో సేవలు అందిస్తున్నారు. పొట్లపల్లి అవార్డుకు ఎంపికై నందుకు కవులు అంపశయ్య నవీన్‌, రామచంద్రమౌళి, డాక్టర్‌ ఎల్‌ఎస్‌ఆర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ బన్న అయిలయ్య, నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్‌ విద్యార్థి, గిరిజా మనోహరబాబు, ఆచార్య గడ్డం వెంకన్న, బిల్ల మహేందర్‌, గట్టు రాధిక తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement