– మరిన్ని ఫొటోలు 9లోu
జిల్లాలోని శివాలయాల్లో మంగళవారం కార్తీకపౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తెల్లవారుజాము నుంచే శివాలయాలకు పోటెత్తారు. ఆలయాల్లోని ధ్వజస్తంభాలు, నందీశ్వరులు, ఉసిరి, మారేడు చెట్ల వద్ద దీపారాధనలు చేశారు. శివలింగాలను దర్శించుకుని పూజలు చేయగా భక్తుల గోత్రనామాలపై అర్చకులు పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. అదేవిధంగా కేశవుడి ప్రతిరూపమైన వేణుగోపాలస్వామి, లక్ష్మీనరసింహస్వామి, వేంకటేశ్వరస్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఆలయాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. భక్తులు దీపదానాలు చేశారు. అలాగే గూడూరులోని శివాలయంలో లక్ష దీపోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
– మహబూబాబాద్ రూరల్/గూడూరు
భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు
● శివకేశవ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
● దీపదానం చేసిన భక్తులు


