హనుమకొండ u
వరంగల్ u
జనగామ u
ములుగు u
మహబూబాబాద్ u
భూపాలపల్లి u
ఆరు జిల్లాల్లోని పాఠశాలలకు రూ.643.20 లక్షల నిధులు ● జీరో నుంచి 10 మంది విద్యార్థులుంటే కేటాయింపుల్లేవు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలకు 2026–27 సంవత్సరానికి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలకు, పీఎంశ్రీ పాఠశాలలకు, జీరో నుంచి 10 మధ్య విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలలకు ఈ నిధులు మంజూరు చేయలేదు.
పాఠశాలల వారీగా నిధులు
ఒకటినుంచి 30 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.10 వేల చొప్పున, 31 నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1,000 మంది విద్యార్థులుంటే రూ.75 వేలు, 1,000పైన విద్యార్థులుంటే రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు మొత్తం రూ.643.20 లక్షలు గ్రాంటు నిధులు మంజూరు చేశారు.
ఈనిధులు వీటికి వినియోగించుకోవాలి..
● పాఠశాలలకు అవసరమైన స్టేషనరీ చాక్‌పీస్‌లు, వైట్ పేపర్లు, రిజిస్టర్లు తదితరాలు సమకూర్చుకోవడం, పరీక్షల నిర్వహణకు వినియోగించుకోవడం.
● స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల నిర్వహణకు వినియోగించుకోవచ్చు.
● పాఠశాలలో ఇంటర్నెట్ చార్జీలకు వినియోగించుకోవాలి..
● కంప్యూటర్లు, ప్రొజెక్టర్ కే–యాన్ టీవీ, తదితర పరికరాల మరమ్మతులకు వినియోగించుకోవాలి.
● తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ వంటి చిన్న చిన్న మరమ్మతులకు వినియోగించుకోవచ్చు.
● తాగునీటి సదుపాయం కల్పించుకునేందుకు కూడా ఈగ్రాంట్‌లో 10 శాతం మొత్తాన్ని స్వచ్ఛత, యాక్షన్‌ప్లాన్‌లో భాగంగా చేతులు కడుక్కునేందుకు లిక్విడ్ సోప్, టాయిలెట్ శుభ్రపర్చే సామగ్రి తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
● దివ్యాంగ విద్యార్థులున్న పాఠశాలల్లో, పాఠశాల ఆవరణలో సురక్షితమైన అవరోధాలు లేని ప్రవేశం కోసం రెయిలింగ్ ఇతర చిన్న సదుపాయాల కోసం గ్రాంటు నుంచి నిధులు వినియోగించుకోవచ్చు.
● పాఠశాలల్లో ఆవరణను క్రమం తప్పకుండా శుభ్రపర్చాలి. శానిటైజ్ చేయాలి. తగిన వెంటిలేషన్‌లో డిస్ ఇన్‌స్పెక్ట్ చేయాలి.
● సబ్బు, హ్యాండ్ శానిటైజర్, క్లోరిన్ సొల్యూషన్ ఇతర శుభ్రపర్చే సామగ్రిని ఎల్లప్పుడూ నిల్వ ఉంచాలి.
● గ్రాంట్ వినియోగానికి సంబంధించి పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ) తీర్మానం చేసి రికార్డుల్లో పేర్కొనాలి.
● గ్రాంటును మార్గదర్శకాలకు అనుగుణంగా సక్రమంగా వినియోగించే బాధ్యత హెచ్‌ఎం/ప్రిన్సిపాళ్లదే..
మొత్తం పాఠశాలలు
మొత్తం గ్రాంటు (లక్షల్లో)


