డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి చర్యలు | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి చర్యలు

Sep 1 2026 1:19 AM | Updated on Sep 1 2026 1:19 AM

తొర్రూరు: డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్‌ తెలిపారు. డివిజన్‌ కేంద్రంలోని దుబ్బతండా సమీపంలోని డబుల్‌ బెడ్రూం ఇళ్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఇళ్ల వద్ద నీరు, విద్యుత్‌, రహదారులు, డ్రెయినేజీలు తదితర సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం 10వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలి ంచారు. మున్సిపల్‌ కమిషనర్‌ వక్కల శ్యామ్‌ సుందర్‌, ఆర్‌అండ్‌బీ డీఈ కృష్ణమోహన్‌, ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు, ఇరిగేషన్‌ డీఈ సునిల్‌, ఏఈలు మహేష్‌, గోపి, యామిని, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మండలంలోని బలరాంతండా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీపీ గౌతమ్‌ సోమవారం సందర్శించి పరిశీలించారు. ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు వచ్చిందని అడిగారు. అదేవిధంగా ఇసుక ఏవిధంగా కొనుగోలు చేసి తీసుకువచ్చారని, అదనంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, బలరాం తండా సర్పంచ్‌ ఇస్లావత్‌ వస్రాం, గృహ నిర్మాణ శాఖ ఏఈ సుమన్‌, పంచాయతీ కార్యదర్శి భవాని ఉన్నారు.

ఇసుక నిల్వల పరిశీలన

నెల్లికుదురు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా మండల కేంద్రంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామ శివారు ఆకేరు వాగులో ఇసుక నిల్వలను హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ సోమవారం పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మా ట్లాడారు. ఎంపీడీఓ సింగారపు కుమార్‌, ఐబీ అధికారులు, హౌసింగ్‌ అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement