విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి

Sep 1 2026 1:19 AM | Updated on Sep 1 2026 1:19 AM

ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

గూడూరు: విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి సూచించారు. మండలంలోని తీగలవేణి 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశీలించి, విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. కొన్ని సమయాల్లో అవసరమైన మరమ్మతుల కోసం జరిగే అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని, అలాంటి పరిస్థితిని వినియోగదారులకు ముందుగా తెలపాలన్నారు.

‘ఓపెన్‌’ ప్రవేశాల

గడువు పొడిగింపు

మహబూబాబాద్‌ అర్బన్‌: ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ 2026–27 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాల దరఖాస్తు గడువు ను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ సత్యనారాయణమూర్తి సోమవారం తెలి పారు. ఆసక్తిగల విద్యార్థులు జిల్లాలోని అన్ని మండలాల విద్యాశాఖ కార్యాలయాలు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఓపెన్‌ టెన్త్‌ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా పరీక్షల విభాగం అధికారి మందుల శ్రీరాములు 9849761012 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయాలి

గూడూరు: జిల్లాలో 14–15సంవత్సరాలలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ అన్నారు. మండలంలోని తీగలవేణి పీహెచ్‌సీని సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ కార్యక్రమాలకు చెందిన పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి సీజనల్‌ వ్యాధులు, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌కు సంబంధించిన పలు సూచనలు చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, సమయానుకూలంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యుడు రాంబాబు, సూపర్‌వైజర్‌ శానుబేగం, గణేష్‌, ఫార్మసిస్టు అమల, మధు, సిబ్బంది పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో జిల్లాలోని అర్హులైన మైనార్టీ అభ్యర్థుల నుంచి గ్రూపు–1 నుంచి గ్రూపు–4 ఉద్యోగాల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగలక్ష్మి సోమవారం తెలిపారు. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఈ నెల 1నుంచి 14 తేదీ వరకు ఆన్‌లైన్‌లో www.directormscccctelangana@gmail.com దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జిల్లా నుంచి 100 మంది అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభిస్తామన్నారు. డిజిటల్‌ స్కానింగ్‌ కోసం అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040– 23236112, 9059050062 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement