మహిళా డెయిరీ పాలసేకరణ ధరల పెంపు | - | Sakshi
Sakshi News home page

మహిళా డెయిరీ పాలసేకరణ ధరల పెంపు

Sep 1 2026 1:19 AM | Updated on Sep 1 2026 1:19 AM

భీమదేవరపల్లి : ముల్కనూరు మహిళా సహకార డెయిరీ పాల సేకరణ ధరలను పెంచుతున్నామని, పెరిగిన ధరలు సెప్టెంబర్‌ 1 (మంగళవారం) ఉద యం నుంచే అమల్లోకి వస్తాయని డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, జనరల్‌ మేనేజర్‌ మార్పాటి భాస్కర్‌ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపా రు. తాజా నిర్ణయం ప్రకారం సగటున ఆవు పాలపై లీటరుకు రూ. 1.25, గేదె పాలపై లీటరుకు రూ. 3.50 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత మహిళలు పాడి పశుపోషణపై ఆధారపడి పాల ఉత్పత్తిని పెంచుకుంటూ తమ కుటుంబాలకు ప్రధాన ఆర్థిక వనరుగా మా ర్చుకుంటున్నారన్నారు. మా ర్కెట్‌లో పోటీ, పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాల సేకరణ ధరలను పెంచినట్లు పేర్కొన్నారు. సభ్యులందరూ పరస్పర సహకారంతో డెయిరీని విజయవంతంగా నడిపిస్తూ, లాభాలను ఏటా బోనస్‌ రూపంలో తిరిగి పొందుతున్నారని గుర్తుచేశారు. పెరిగిన పాల ధరలు, డెయిరీ అందిస్తున్న వివిధ సేవలను సభ్యులందరూ సద్వినియోగం చేసుకుని, పాల సేకరణను మరింత పెంచి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.

ఆవు పాలకు సగటున రూ. 1.25,

గేదె పాలకు రూ. 3.50 పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement