● మహిళా సర్పంచ్‌ల ఫోరం
రాష్ట్ర అధ్యక్షురాలు గుంటిపల్లి రేణుక
ధర్మసాగర్ : చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించడం పట్ల రాష్ట్ర మహిళా సర్పంచుల ఫోరం హర్షం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళా సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటిపల్లి రేణుక సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామాల్లో సర్పంచులు వినియోగించుకోవాలని కోరారు. సదరం క్యాంపుల ద్వారా మండల రెవెన్యూ కార్యాలయాల ద్వారా, సంబంధిత కార్యాలయాలనుంచి తగు ధ్రువపత్రాలు తీసుకొని నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ చేసేలా అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. దరఖాస్తు గడువు పెంపు అంశం పేదలపై ముఖ్యమంత్రి కనబరుస్తున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొన్నారు.


