పట్టా తెచ్చిన సంబురం | - | Sakshi
Sakshi News home page

పట్టా తెచ్చిన సంబురం

Sep 1 2026 1:19 AM | Updated on Sep 1 2026 1:19 AM

కేసముద్రం: మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామ రైతులకు ఎట్టకేలకు పట్టాదారు పాసుపుస్తకాలు రావడంతో సంబురాలు జరుపుకున్నారు. సోమవారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్‌, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌తో కలిసి కేసముద్రంవిలేజ్‌లో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం కేసముద్రం మున్సిపాలిటీ నూతన భవనం, ఇనుగుర్తి, దంతాలపల్లి, సీరోలులో నూతన తహసీల్దార్‌ భవన నిర్మాణాలకు ఇక్కడి నుంచే శంకుస్థాపనలు చేశారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన సభలో నారాయణపురం రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నారాయణపురం గ్రామ సమస్య స్టేట్‌ ఇష్యూగా మారిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూభారతి ద్వారా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో నారాయణపురం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు రావడం సంతోషంగా ఉందన్నారు. మిగిలిన 150 ఎకరాల సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే అన్నివిధాలా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎంపీ పోరిక బలరాంనాయక్‌ మాట్లాడుతూ.. నారాయణపురం రైతుల సమస్యను పరిష్కరించేందుకు గతంలో ప్రయత్నించామని, ప్రస్తుతం పాసుపుస్తకాలు అందించి న్యాయం చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్‌ మాట్లాడుతూ.. మానుకోటలో ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల భవనాలు మంజూరు చేయాలని మంత్రులను కోరారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఎస్పీ శబరీష్‌, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కేఆర్‌.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, సీసీఎల్‌ సెక్రటరీ లోకేశ్‌కుమార్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బానోత్‌ సునీతవెంకన్న, వైస్‌చైర్‌పర్సన్‌ అల్లం రమనాగేశ్వర్‌రావు, నారాయణపురం సర్పంచ్‌ ధారావత్‌ యమునసుమన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

నారాయణపురం రైతులకు మంత్రుల చేతులమీదుగా పట్టాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement