చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్ష

Sep 1 2026 1:19 AM | Updated on Sep 1 2026 1:19 AM

ఖమ్మం లీగల్‌: అప్పు చెల్లించే క్రమాన జారీ చేసిన చెక్కు చెల్లకపోవడంతో జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఫస్ట్‌ అడిషనల్‌ జ్యుడీషియల్‌ మేజిస్టేట్‌ కోర్టు జడ్జి బెక్కం రజిని సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడేనికి చెందిన సిరికొండ వెంకటేశ్వర్లు వద్ద మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం దేస్యాతండా గ్రామానికి చెందిన బానోతు రాజేష్‌ అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమాన ఆయన జారీ చేసిన చెక్కు చెల్లకపోవడంతో వెంకటేశ్వర్లు తన న్యాయవాదుల ద్వారా లీగల్‌ నోటీసు జారీ చేసి కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం రాజేష్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.3లక్షల పరిహారం చెల్లించాలని ఖమ్మం ఫస్ట్‌ అడిషనల్‌ జ్యుడీషియల్‌ మేజిస్టేట్‌ కోర్టు జడ్జి బెక్కం రజిని సోమవారం తీర్పు ఇచ్చారు.

మనస్తాపంతో వ్యక్తి

మృతి

మల్కాపూర్‌లో ఘటన

చిల్పూరు : వ్యవసాయ భూమి కబ్జాకు గురైందని తనకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్‌లో చోటు చేసుకుంది. మృతుడి కుమారుడు లింగారెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిల్లా మల్లారెడ్డి(55) వ్యవసాయ భూమిని గ్రామానికి చెందిన కొందరు నాయకులు కబ్జా చేశారు. దీనిపై మల్లారెడ్డి జీపీ ఎదుట తనకు న్యాయం చేయాలని నిరసన చేపట్టాడు. అధికారులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నెలలు దాటుతున్నా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మల్లారెడ్డి మనస్తాపంతో అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఇప్పటికై నా తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతుడి కుమారుడు లింగారెడ్డి కోరారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ..

రఘునాథపల్లి: హ నుమకొండ–హైదరాబాద్‌ జాతీయ రహదారిలోని రఘునాథపల్లి బ్రిడ్జిపై కాలినడకన వెళ్తున్న ఓ మహిళను మినీ వ్యాన్‌ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని భాంజీపేటకు చెందిన ఈరాపురం వెంకటమ్మ(50),యాదగిరి దంపతులు రఘునాథపల్లిలో బయటి కమ్మరి వృత్తి చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఆదివారం స్వగ్రామానికి వెళ్లి అర్ధరా త్రి సమయంలో నిడిగొండ నుంచి కాలినడకన రఘునాథపల్లికి బయలు దేరారు. మండల కేంద్రంలో బ్రిడ్జిపై నుంచి కాలినడకన వెళ్తుండగా జనగామ నుంచి వరంగల్‌ వైపునకు వెళ్తు న్న టాటా మినీ వ్యాన్‌ వెంకటమ్మను ఢీకొంది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలుకాగా వెంటనే 108లో జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement