‘రూట్లెంగెన్‌’తో కేయూ అవగాహన ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

‘రూట్లెంగెన్‌’తో కేయూ అవగాహన ఒప్పందం

Sep 1 2026 1:19 AM | Updated on Sep 1 2026 1:19 AM

కేయూ క్యాంపస్‌ : అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్య అవకాశాలు అందించేందుకు కాకతీయ యూనివర్సిటీ మరో కీలక ముందడుగు వేసింది. జర్మనీలోని రూట్లెంగెన్‌ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జర్మనీ రూట్లెంగెన్‌ యూనివర్సిటీ ప్రత్యేక ప్రతినిధి రాజ్‌వంగపండు, కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి పాల్గొని అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఓయూ వీసీ కుమార్‌ సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. కేయూ యూజీసీ కోఆర్డినేటర్‌, రూసా నోడల్‌ అఽధికారి ఆర్‌. మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు. రూట్లెంగెన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ బ్రూనె జోచెన్‌, ప్రోగ్రాం మేనేజర్‌ స్టెఫాన్‌ డెగ్లిమాన్‌ ప్రతినిధులుగా ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.

ఈ ఎంఓయూతో ప్రయోజనం..

జర్మనీ రూట్లెంగెన్‌ యూనివర్సిటీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంతో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు 3 ప్లస్‌ 2 మాస్టర్స్‌ కోర్సు ద్వారా తమ ఉన్నత విద్యను జర్మనీలో కొనసాగించే అవకాశం పొందనున్నారు. ఇందులో మొదటి మూడు సంవత్సరాల విద్యను కాకతీయ యూనివర్సిటీలో పూర్తిచేసి తదుపరి రెండేళ్లు మాస్టర్స్‌ విద్యను జర్మనీ రూట్లెంగెన్‌ యూనివర్సిటీలో అభ్యసించే అవకాశం ఉంటుంది. మొదటి మూడు సంవత్సరాల డిగ్రీ అనంతరం ఆ జర్మనీ యూనివర్సిటీ మాస్టర్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది.

కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌, ఇంజనీరింగ్‌ విభాగాలకు చెందిన విద్యార్థులు రూట్లెంగెన్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, ఇతర వి భాగాలకు చెందిన విద్యార్థులు మాస్టర్‌ ఆఫ్‌ డిజి టల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ వంటి మాస్టర్స్‌ కోర్సుల్లో విద్యను కొనసాగించేందుకు అవకాశం కల్పించనున్నారని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం తెలిపారు. తొలుత ఈ కార్యక్రమం ద్వారా కేయూ నుంచి 20మంది విద్యార్థులను మెరిట్‌ కమ్‌ రిజర్వేషన్‌ ప్రాతిపదికన ఎంపిక చేయబోతున్నారు. ఎంపికై న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి విద్యనభ్యసించడంతోపాటు జర్మనీలో ఉన్నత విద్య, భవిష్యత్‌ ఉపాధి అవకాశాలను పొందేందుకు ఈ ఒప్పందం దోహపడుతుందని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement