‘సాక్షి’ దీక్ష కథనాన్ని పంచుకున్న సీఐఈటీ | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ దీక్ష కథనాన్ని పంచుకున్న సీఐఈటీ

Sep 1 2026 1:19 AM | Updated on Sep 1 2026 1:19 AM

జనగామ : జనగామ జిల్లా నుంచి దీక్ష కార్యక్రమానికి సంబంధించిన ‘సాక్షి’ కథనాన్ని కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ (సీఐఈటీ) తన అధికారిక సామాజిక మాధ్యమాలు ఎక్స్‌, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌, లింక్ట్‌ఇన్‌ అధికారిక ఖాతాల ద్వారా పంచుకుంది. జిల్లాలో దీక్ష శిక్షణ కార్యక్రమం అమలుపై ఆదివారం ప్రచురితమైన ‘సాక్షి’ కథనాన్ని ఎన్‌సీఈఆర్‌టీ దీక్ష సామాజిక మాధ్యమ వేదికల్లో జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం విశేషంగా నిలిచింది. దీనిపై విద్యాశాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

2, 5న తిరుపతి–రక్సోల్‌–తిరుపతి

ఎక్స్‌ప్రెస్‌లు రద్దు

కాజీపేట రూరల్‌ : కాజీపేట జంక్షన్‌ మీదుగా తిరుపతి–రక్సోల్‌–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సర్వీస్‌లను నవంబర్‌ 2, 5వ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ సోమవారం తెలిపారు. సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో చక్రాధర్‌పూర్‌ డివిజన్‌లో బగ్‌దేహి–జర్సుగూడ మధ్య 4 లైన్ల నిర్మాణంతో చేపట్టిన రైల్వే నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ వర్క్‌తో ఈ రెండు రైళ్ల సర్వీస్‌లను రద్దు చేసినట్లు తెలిపారు.

రద్దయిన రైళ్లు..

2వ తేదీన తిరుపతి–రక్సోల్‌ (17433) ఎక్స్‌ప్రెస్‌, నవంబర్‌ 5వ తేదీన రక్సోల్‌–తిరుపతి (17434) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు సీపీఆర్వో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement