వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ శ్వేత సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.శ్రీనివాస్ వీఆర్ నుంచి స్టేషన్ ఘన్‌పూర్, జి.వేణు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి సీఐ రఘునాథపల్లి, ఎ.శ్రీనివాస్ రఘునాథపల్లి నుంచి ఎస్‌బీ వరంగల్, పి.దేవేందర్ టాస్క్‌ఫోర్స్ నుంచి సీఐ నర్మెట్ట, టి.రవికుమార్ పీటీసీ వరంగల్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్–2, ఎ.సువర్ణ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి సీసీఎస్, పి.మంగిలాల్ టాస్క్‌ఫోర్స్ నుంచి అటాచ్డ్ మిల్స్‌కాలనీ, భరత్ సుమన్ సీఐ పాలకుర్తి, వి.జానకీరామ్‌రెడ్డి పాలకుర్తి నుంచి ఎస్‌బీ వరంగల్, టి.కిరణ్ పీసీఆర్, ఎ.ప్రవీణ్‌కుమార్ వీఆర్ వరంగల్ నుంచి పరకాల, వి.క్రాంతికుమార్ పరకాల నుంచి టాస్క్‌ఫోర్స్, జి.బాబులాల్ టాస్క్‌ఫోర్స్ నుంచి ఆత్మకూరు, ఆర్.సంతోశ్ ఆత్మకూరు నుంచి పర్వతగిరి సర్కిల్, బి.రాజగోపాల్ పర్వతగిరి నుంచి టాస్క్‌ఫోర్స్, కె.శ్రీను వీఆర్ వరంగల్ నుంచి ఎల్కతుర్తి, పి.రమేశ్ ఎల్కతుర్తి నుంచి మహిళా పోలీస్ స్టేషన్–1, కె.సూర్యప్రసాద్ మహిళా పోలీస్ స్టేషన్–1 నుంచి సీటీసీ వరంగల్, కె.సాయిరమణ వీఆర్ వరంగల్ ఎస్‌బీ వరంగల్, వై.సంజీవ్‌రావు సీసీఆర్‌బీ వరంగల్ నుంచి సీఐ వర్ధన్నపేట, కె.శ్రీనివాస్‌రావు వర్ధన్నపేట నుంచి సీసీఆర్‌బీ వరంగల్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మొత్తం కమిషనరేట్ పరిధిలో 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది.
ఒకేసారి 22 మందికి స్థానచలనం
ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ శ్వేత


