తమ్ముడిని కాపాడబోయి అన్న .. | - | Sakshi
Sakshi News home page

తమ్ముడిని కాపాడబోయి అన్న ..

Aug 31 2026 1:20 AM | Updated on Aug 31 2026 1:20 AM

ములుగు మున్సిపాలిటీ పరిధి గణేశ్‌లాల్‌పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో పడి మాలోతు వినయ్‌ (15), రాజేశ్‌ (12) అన్నదమ్ములు మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురానికి చెందిన వీరు రాఖీ పౌర్ణమి సందర్భంగా తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో స్థానికులు బయటకు తీసి ములుగు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ములుగు జిల్లా గణేశ్‌లాల్‌పల్లి మొండికుంటలో మునిగి మృతిచెందిన అన్నదమ్ములు వినయ్‌, రాజేశ్‌ (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement