రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులతో
నిండిపోయిన ప్లాట్‌ఫాం
కేసముద్రం రైల్వేస్టేషన్‌లో ఒకటే టికెట్ కౌంటర్ ఉండడంతో కిక్కిరిసిన ప్రయాణికులు
కేసముద్రం: రాఖీ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణం కావడం కేసముద్రం రైల్వేస్టేషన్ ఆదివారం కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి తిరిగి పట్టణాలకు వెళ్లేందుకు అధిక సంఖ్యలో ప్రయాణికులు కేసముద్రం రైల్వేస్టేషన్‌కు చేరుకోగా ప్లాట్‌ఫాంపై రద్దీ ఏర్పడింది. ఇదిలా ఉంటే కేసముద్రం రైల్వేస్టేషన్‌లో ఒకటే టికెట్ కౌంటర్ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ వైపునకు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కేసముద్రం రైల్వేస్టేషన్‌లో నిలవగా, ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ఇబ్బందులు పడ్డారు. రైలు బోగీలు అన్ని అప్పటికే ప్రయాణికులతో కిక్కిరిసిపోగా, కాలు పెట్టలేని పరిస్థితి ఉంది. దీంతో రైలు ఎక్కిన ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
రాఖీ పండుగకు వచ్చి వెళ్తుండడంతో రద్దీ


