పిచ్చిమొక్కల మధ్య ఉన్న ద్విచక్ర వాహనాలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ ఎ కై ్సజ్ స్టేషన్ ఆవరణలో బెల్లం, పటిక, గుడుంబా తరలిస్తూ వివిధ కేసుల్లో పట్టుబడ్డ ద్విచక్రవాహనాలకు రక్షణ కరువై ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ పాడైపోతున్నాయి. సుమారు వందకుపైగా వాహనాలు నెలల తరబడి మూలనపడి ఉండడంతో వాటి చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి పలు వాహనాల స్పేర్ పార్ట్‌లు పనికిరాకుండాపోతున్నాయి. అలాగే వివిధ కేసుల్లో పట్టుబడ్డ బెల్లం, పటిక బస్తాలు కూడా ఎకై ్సజ్ స్టేషన్ ఆవరణలో ఉండగా వాటి పరిస్థితి ఇదే విధంగా మారింది. వర్షం వచ్చినప్పుడల్లా కొంతకొంత బెల్లం, పటిక కరిగిపోతుంది. వాటికి సంబంధించి పట్టుబడిన వాహనాల దుస్థితి అధ్వానంగా తయారవుతుంది. వాహనాలు ఎండకు ఎండుతూ.. వర్షానికి తడుస్తూ ఉండడం వల్ల వాటికి వేలంపాటలు నిర్వహించినప్పుడు తక్కువ ధరలు పలుకుతుండగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.


