ఎంజీఎం సూపరింటెండెంట్‌ ఎవరు? | - | Sakshi
Sakshi News home page

ఎంజీఎం సూపరింటెండెంట్‌ ఎవరు?

Jun 18 2026 1:05 AM | Updated on Jun 18 2026 1:05 AM

నిలిచిపోయిన మందుల

కొనుగోళ్లు

పరికరాల మరమ్మతుకు

చిల్లగవ్వ లేక సతమతం..

కాశిబుగ్గ: వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాలలో (ఎంజీఎం) కొత్త సూపరింటెండెంట్‌గా ఎవరిని నియమిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పది రోజుల దాటినా పోస్టును భర్తీ చేయకపోవడంతో ఆస్పత్రిలో పాలన గతి తప్పుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దికై ్కన ఈ ఆస్పత్రిపై ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఎంజీఎం మరో కొన్ని నెలల్లో 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ భవనంలోకి మారనున్న ఈ సమయంలో సూపరింటెండెంట్‌ పోస్టు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్టు కోసం రోజుకో సీనియర్‌ వైద్యుల పేరు వినపడుతున్నా భర్తీకి నోచుకోవడం లేదు. ఓ ఇద్దరు సీనియర్‌ వైద్యులు ఎంజీఎంలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేసినా వారికి ఎందుకో అవకాశం లభించలేదని తెలుస్తోంది.

ఎంజీఎంలో నిలిచిన పేమెంట్స్‌..

ఇంత పెద్ద దవాఖానాకు వివిధ పనుల కోసం ఎన్నో ఖర్చులు ఉంటాయి. అయితే వాటికి సకాలంలో పేమెంట్స్‌ చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చేసిన పనులు, అత్యవసర పనులు, ఇంకా చేయాల్సిన పనుల కోసం ఎంజీఎంలో చెల్లించడానికి ఎవరికీ అధికారం లేదు. ఇలాంటి వాటికి డబ్బులు ఎలా ఇవ్వాలంటూ అధికారులు సతమతమవుతున్నారు.

చెక్‌ పవర్‌ లేక అధికారులకు

ఆర్థిక ఇబ్బందులు..

సాధారణంగా చెక్‌ పవర్‌ సూపరింటెండెంట్‌కు ఉంటుంది. అయితే పది రోజుల నుంచి సూపరింటెండెంట్‌ లేకపోవడంతో అధికారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. డబ్బులు చెల్లించనిదే పనులు కావడం లేదని తెలుస్తోంది. దీంతో ఆస్పత్రికి సంబంధించిన చెల్లింపులు ఎలా చేయాలో అర్థం కాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఇన్‌చార్జ్‌ బాధ్యతలు లేకపోవడంతో చెక్‌ పవర్‌ కూడా అందని పరిస్థితి నెలకొంది. పైసలు లేకుండా ఆస్పత్రిని ఎలా నడిపించాలో, ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఇలాంటి కిష్ట పరిస్థితుల్లో కొత్త సూపరింటెండెంట్‌గా ఎవరూ వస్తారో వేచిచూడాల్సిందే.

?

ఆస్పత్రికి అవసరమైన వివిధ మందుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఏ మందులు కొనాలన్నా సూపరింటెండెంట్‌ అనుమతి తీసుకోవాలి. అలాగే ల్యాబ్‌ అవసరమైన కెమికల్స్‌ కోసం ఉన్నతాధికారి పర్మిషన్‌ తీసుకోవాలి. ఈ ఉన్నతాధికారి లేకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ సిబ్బంది వాపోతున్నారు. దీంతో పేషెంట్లకు అవసరమైన ఔషధాలకు కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ స్టోర్‌లో ఉన్న మందులతోనే సరిచేయడం తప్ప కొత్తవి కొనుగోలు చేయడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో పేషెంట్లకు అరకొర మందులు దిక్కవుతున్నాయి.

ఎంజీఎంలో తరచూ ఏదో ఓ పరికరాన్ని మరమ్మతు చేయాల్సి వస్తోంది. దీంతో అధికారుల చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏమి చేయాలో అర్థంకాని దుస్థితి నెలకొంది. ప్రైవేట్‌గా పరికరాల మరమ్మతు చేసినప్పుడు సదరు వ్యక్తులకు పేమెంట్స్‌ చేయకపోతే వారు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ రిపేర్‌ కోసం రమ్మంటే రాని పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల ఎంజీఎం అనుబంధంగా ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిఫ్ట్‌ మరమ్మతు చేయిస్తే, డబ్బులు చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు సమాచారం.

పది రోజులు దాటినా నియమించని ప్రభుత్వం

నిలిచిపోయిన పేమెంట్స్‌..

ఆగిన మందుల సరఫరా

పరికరాల మరమ్మతులకు

డబ్బులు కరువు

ఎవరికీ చెక్‌ పవర్‌ లేక అధికారుల సతమతం

కొత్త బిగ్‌బాస్‌ కోసం నిత్యం

ఎదురుచూపులే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement