ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

Jun 18 2026 1:05 AM | Updated on Jun 18 2026 1:05 AM

మామునూరు : కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని బీజేపీ రాష్ట్ర (సంస్థాగత) ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ జీ అన్నారు. బుధవారం వరంగల్‌ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రకృతి వ్యవసాయం– రైతు కార్యశాల’ కార్యక్రమం నిర్వహించారు. చంద్రశేఖర్‌ తివారీ జీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలన దేశ చరిత్రలో విశ్వాసం– అభివృద్ధి– ప్రజా సంక్షేమం– వ్యవసాయ రంగంలో స్వర్ణయుగానికి నాంది పలికిందని కొనియాడారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని అధిక లాభాలు పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతో దోహద పడుతుందని వివరించారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. బీజేపీ నేతలు గౌతమ్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, అజ్మీరా సీతారామ్‌ నాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్‌, రాజేశ్వర్‌రావు, అధికార ప్రతినిధులు రాణి రుద్రమాదేవి, వన్నాల వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు నిషిధర్‌రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, రాజమౌళి గౌడ్‌, చాడ శ్రీనివాస్‌రెడ్డి, జలగం రంజిత్‌, కుసుమ సతీశ్‌, భాకం హరిశంకర్‌, నరేశ్‌, బన్న ప్రభాకర్‌, ప్రతాప్‌, పుల్లారావు, మంజుల రెడ్డి, గందె నవీన్‌, కన్నయ్య, రమ్య, రైతులు పాల్గొన్నారు

రైతు సంక్షేమానికి

కేంద్రం పెద్దపీట

బీజేపీ రాష్ట్ర (సంస్థాగత) ప్రధాన కార్యదర్శి

చంద్రశేఖర్‌ తివారీ జీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement